గ్రేటర్ ఎన్నికలు: కేంద్ర మంత్రిని దింపిన బిజెపి…!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం బిజెపి కష్టపడుతుంది. బిజెపి కీలక నేతలు అందరూ కూడా గ్రేటర్ పరిధిలో పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నారు. అగ్ర నేతలను ఈ ఎన్నికల కోసం బిజెపి వాడుకునే ఆలోచనలో ఉంది. ఇప్పుడు మరొకరిని రంగంలోకి దించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం కోసం బిజెపి కీలక నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ రానున్నారు.

ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. రేపు హైదరాబాద్ కు కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ వస్తారని ప్రకటించారు. టీఆర్ఎస్ అమలు చేయని హామీలపై ఛార్జ్ షీట్ విడుల చేయనున్నారు జావడేకర్. బీజేపీ మ్యానిఫెస్టోకు సలహాలు సూచనలు స్వీకరిస్తున్నాం అన్నారు. రెండు మూడు రోజుల్లో మా మ్యానిఫెస్టోను ప్రజల ముందుంచుతాం అని స్పష్టం చేసారు.