అమిత్ షా కు షాక్, ఫ్లకార్డ్ విసరగానే, ఊహించని పరిణామం…!

-

కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చెన్నై పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల నేపధ్యంలో అక్కడ పర్యటిస్తున్న ఆయన… రాజకీయ ఎత్తులపై సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఈ తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి బిజెపి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ బయటకు వచ్చారు.

ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తున్న నిరసనకారుడు ఒక ఫ్లకార్డ్ ని విసిరాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆయనపై అది పడకుండా అడ్డుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గో బ్యాక్ అమిత్ షా నినాదం అక్కడ మార్మోగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news