షూటింగ్ లో ప్రకాష్ రాజు కు తీవ్ర గాయాలు

-

ప్రముఖ నటుడు, ఉత్తమ జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజు కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాష్ రాజు చేయికి షూటింగ్ లో గాయాలయ్యాయి. పొరపాటున జారి పడటంతో … చిన్నపాటి గాయాలు అయ్యాయి స్వయంగా ప్రకాష్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

చిన్ననాటి మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి… చేతిలో తన చేయి కి సర్జరీ చేయించుకోవడానికి… ప్రత్యేకంగా హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారు ప్రకాష్ రాజు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని…. ఎవరు కంగారు పడాల్సిన పని లేదని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే చెన్నై లో జరుగుతున్న ధనుష్ సినిమా షూటింగ్ లోనే…. నటుడు ప్రకాష్ రాజ్ గాయపడ్డట్టు సమాచారం అందుతోంది. కాగా నటుడు ప్రకాష్ రాజ్…. మా  అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రకాష్ రాజ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news