‘మా’ కు పోటీగా మరో అసోసియేషన్‌ : ప్రకాశ రాజ్‌ సంచలన ప్రకటన ?

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తర్వాత నుంచి టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రకాశ్‌ రాజ్‌ మరియు మెగా ఫ్యామిలీకి నిన్న మంచు ప్యానెల్‌ కౌంటర్‌ ఇవ్వగా… ఇవాళ… రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చేందుకు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సిద్ధమౌవుతోంది. ఇందులో భాగంగానే మరి కాసేపట్లో మరోసారి మీడియా ముందుకు రానున్నారు ప్రకాశ్‌ రాజ్‌.

గెలిచిన మరియు ఓడి పోయిన తన ప్యానెల్‌ సభ్యులతో ప్రకాశ్‌ రాజ్‌ ప్రస్తుతం చర్చలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రకాశ్‌ రాజ్‌ ఇవాళ నిర్వహించే ప్రెస్‌ మీట్‌ పై టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మా కు పోటీ గా ATMAA (ఆల్‌ తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌) తీసుకు వచ్చే యోచనలో ప్రకాశ్‌ రాజ్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. మా అసోషియేషన్‌ కు అందరూ రాజీనామా చేసి… ఆల్‌ తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. దీనిపై క్లారిటీ రావాలంటే.. మరి కొన్ని క్షణాలు ఆగాల్సిందే.