PRANITHA : బేబీ బంప్ చూపిస్తూ ప్రణీత మెసేజ్..పోస్ట్‌ వైరల్‌

-

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్‌గా ఉన్న ప్ర‌ణీత కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. పెద్ద హీరోయిన్ కాక‌పోయినా స్టార్ హీరోయ‌న్ల రేంజ్‌లో ఫ్యాన్ బేస్ ఉంది ఈ భామ‌కు. ఆమె అందానికి ఫిదా కాని వారే ఉండ‌రు. ఏం పిల్లో.. ఏం పిల్లడో ఎంట్రీ ఇచ్చి.. ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేసింది.

ఇక ఈ మధ్య కాలంలో.. టాలీవుడ్‌ సినిమాల్లో ఛాన్సులు లేక.. తమిళ సినిమాలపై ఫోకస్‌ చేస్తోంది. మూడు రోజుల కిందట తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫిషియల్‌ గా ప్రకటించింది ఈ బ్యూటీ. ఇక తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తన బేబీ బంప్‌ ఫోటోను మరొటి షేర్‌ చేసింది హీరోయిన ప్రణీత.

”మహిళలు ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్‌ అయ్యాక ప్రతి సారి తమ పొట్టను ఇలా చూసుకుంటూ ఎంజాయ్‌ చేస్తుంటారు” అంటూ ఆ ఫోటోపై ట్యాగ్‌ లైన్‌ రాసుకొచ్చింది ప్రణీత. దీంతో ఈ పిక్‌ నెట్టింట వైరల్‌ గా మారి పోయింది. ప్రణీతకు కంగ్రాట్స్‌ చెబుతూనే.. ప్రెగ్నెన్సీ ని ఇలా ఎంజాయ్‌ చేయడంలోనే థ్రిల్‌ ఉంటుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news