నెల్లూరు జిల్లాలో కొడవలూరు మండలం లో నవరత్నాలు పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమంలో కోవూరు శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ పై విరుచుకు పడ్డారు. దళిత నాయకుడు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. తెలుగుదేశం మాజీ మంత్రులు సిఫార్సు మేరకు కేసు నమోదు చేయకపోవడం చాలా దారుణం అన్నారు. ఎస్పీ పని తీరు మార్చుకోవాలన్న ఆయన ఏ గవర్నమెంట్ లో విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలన్నారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని అన్నారు. కేసు తీసుకోకుండా ఉండమని చెప్పటానికి ఎస్పీ ఎవరు ? అని ప్రశ్నించిన ఆయన తెలుగుదేశం పార్టీ ఏజెంటువా ప్రభుత్వ అధికారివా ? నాతో పెట్టుకోకు పద్ధతిగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడున్న కొన్ని రోజులైనా పద్ధతిగా నడుచుకొని జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇక్కడ ఉండే రెండు నెలలు అయినా సక్రమంగా పనిచేసి మంచి అనిపించుకోవాలని లేకుంటే తానేంటోచూపిస్తానని తెలిపారు. నిన్ను ఎవరు కాపాడుతారు అనుకుంటున్నావు విజయవాడలో ఉన్న డిజిపి కాపాడుతాడు అనుకుంటున్నావా ? అని అయన ప్రశ్నించారు.