ఏపీ సీఎం జగన్​పై పీకే సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వంటివారి లక్ష్యాలను నెరవేర్చేందుకు తాను సాయపడడం కన్నా కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి కృషి చేసి ఉంటే బాగుండేదని జన సురాజ్‌ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. అసలైన ‘మహాత్మాగాంధీ కాంగ్రెస్‌’కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమనేది తనకు చాలా ఆలస్యంగా అర్థమైందని చెప్పారు.

బిహార్‌లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న పీకే.. పశ్చిమ చంపారన్‌ జిల్లా లౌరియాలో ఆదివారం రోజున ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ నేతృత్వంలోని కమలదళం విజయ యాత్రను అడ్డుకోవడంలో విపక్షాల కూటమి సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీని అర్థం చేసుకోకుండా ఆ పార్టీని ఓడించలేరని విశ్లేషించారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఓ కప్పులో పైపైన ఉండే నురుగు బీజేపీ అయితే దానికింద ఉండే అసలైన కాఫీయే ‘రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌’ (ఆరెస్సెస్‌) అని వ్యాఖ్యానించారు. సామాజిక వ్యవస్థలో ఆరెస్సెస్‌ భాగమైపోయిందనీ, షార్ట్‌ కట్స్‌తో దాన్ని ఓడించలేరని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news