గద్ద రెక్కల కింద కోడిపిల్లలు..కేసీఆర్‌ సభపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

-

గద్ద రెక్కల కింద కోడిపిల్లలు అంటూ కేసీఆర్‌ సభపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ గారూ… మీ ఎన్నికల ప్రసంగం కన్నా అవాస్తవాలు ఎక్కడైనా ఉంటాయా ? అని ప్రశ్నించారు. కరెంట్ మీటర్ల అంశం మీ నిరంతర మాటల మోసం… చేనేత కార్మికులపై మీరు మాట్లాడినది వాస్తవదూరమని పేర్కొన్నారు.

ఇక ఎమ్మెల్యేల కొనుగోలుపై నేను చెప్తున్నట్లుగానే అది బీజేపీకి సంబంధం లేని వ్యవహారం. మీరు కుట్ర చేసి నడిపించబట్టే… ఆ నలుగురు ఎమ్మెల్యేలను బయటకు వదిలే ధైర్యం లేక… కోడి పిల్లలను బుట్టల పెట్టినట్లు ప్రగతి భవన్‌ల దాయబెట్టి ప్రజలను ధోకా చేస్తున్నారని ఆగ్రహించారు.

ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరు సంఘటన జరిగిన నాడు… “మేమంతా కేసిఆర్ గారు చెప్పినట్టే చేసినం…” అని ప్రెస్ ముందు చేసిన ఒక కామెంట్ తర్వాతనే మీరు ఈ ఎమ్మెల్యేల హోస్టేజ్ సన్నివేశం చేసింది నిజం కాదా?… నిజాయితీపరులు అని మీరే చెబుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలనూ నాలుగు రోజుల నుండీ నిర్బంధించవలసిన అగత్యం ఏంటి? వారు నిజం బయట పెడతారనేనా? ఎన్నికలలోపు వారు ప్రగతిభవన్ కట్టడి నుండి బయటకు రాగలిగిన అవకాశం ఇంతకూ మీ నియంతృత్వ గడీల పాలనలో ఉందా లేదా? అని పేర్కొన్నారు విజయశాంతి.

 

Read more RELATED
Recommended to you

Latest news