విపక్షాలకు నాయకత్వం వహించడం కాంగ్రెస్ కు దేవుడిచ్చిన హక్కా..? ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

నిన్న యూపీఏ ఎక్కడ ఉందంటూ.. నిన్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. మమతా బెనర్జీ. నిన్న ముంబైలో శరద్ పవార్ తో భేటి తరువాత మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసింది. తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తను ఈ విమర్శలను గుప్పించాడు.

పీకే ట్విట్టర్ లో స్పందిస్తూ… ’’ప్రతిపక్షాలకు నాయకత్వం వహించడం కాంగ్రెస్ పార్టీకి దేవుడు ఇచ్చిన హక్కుగా భావిస్తుందని.. ఆపార్టీ గడిచిన 10 ఏళ్లలో 90 శాతం ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రతిపక్షాలకు నాయకత్వ వహించే వారిని ప్రతిపక్షాలే నిర్ణయించుకోవాలి‘‘. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల కాలంలో మమతా బెనర్జీ ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఎన్నికలకు మరో రెండేళ్లే సమయంల ఉండటంతో ఈ సమయంలోనే దేశంలోని ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీని వెనక నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సహాయం చేస్తున్నాడు. బీజేపీకి గట్టి ప్రత్యామ్నాయం తయారు చేయాలని టీఎంసీ భావిస్తోంది. పశ్చిమ బెంగాల్ నుంచి త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని మేఘాలయ, త్రిపుర, యూపీ, గోవా రాష్ట్రాల్లో విస్తరించేందుకు మమతా ప్రయత్నాలు చేస్తోంది.