ప్రీలుక్ పోస్టర్: నితిన్ తెలుగు అంధాధున్..

Join Our Community
follow manalokam on social media

రంగ్ దే సినిమా థియేటర్లలో సందడి చేయనుండగానే నితిన్ నుండి మరో సినిమా అప్డేట్ రాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన రంగ్ దే, ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. ఐతే రేపు నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నితిన్ తర్వాతి చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు రానుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న అంధాధున్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర తెలుగు రీమేక్ ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ప్రీ లుక్ పోస్టర్ ని వదిలారు. పియానో వాయిస్తున్న నితిన్ ని వెనకాల నుండి చూపించారు. పక్కన పియానో మీద పాలు తాగుతున్న పిల్లి ఉంది. డార్క్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా చేస్తుండగా, కీలకమైన పాత్రలో తమన్నా మెరవనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.

TOP STORIES

శ్రీరామనవమి అంటే రాముని పుట్టిన రోజా? పెళ్ళి రోజా ?

శ్రీరామ నవమి అంటే చాలు అందరికీ పండుగే. ఆ సుగణభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. మరి నిజంగా ఆరోజే...