బంగారం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

-

చాల మంది బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎల్లవేళలా మంచిదని అనుకుంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. 10 గ్రాములు బంగారం ధర దాదాపు రూ. 50 వేల వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఇంత ఖరీదుకు స్వర్ణంపై పెట్టుబడి పెట్టే విషయంపై మరోసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బంగారంలో పెట్టుబడి లేదా వ్యాపారం ప్రయోజనాల్లో బులియన్ నాణేలను ఉపయోగించడం చాలా సాధారణమైన విషయం. వీటిని స్వచ్ఛత కోసం ప్రభుత్వ ఆమోదించిన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ సదుపాయాల ద్వారా తయారు చేసిన బులియన్ నాణేలను మార్కెట్ల ధర ఆధారంగా నిర్దేశిస్తారు. భారత్ లో బంగారు నాణేలను బ్యాంకులు అమ్ముతున్నాయి. 24 క్యారెట్ల బంగారాన్ని అందిస్తారు.

Gold
Gold

అయితే బ్యాంకులు అత్యంత ప్రామాణికమైన నాణేలను విక్రయిస్తాయి. ఇక సాధారణంగా వీటిని స్విట్జర్లాండ్, పాశ్చాత్య దేశాల్లోని ఇతర అంతర్జాతీయ మైనింగ్ కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఫలితంగా మార్కెట్ రేటు కంటే 7 నుంచి 10 శాతం అత్యధిక రేటును బ్యాంకులు వసూలు చేస్తాయి. బంగారం మార్కెట్లో రేట్లు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయని మీరు గమనించాలి. అధిక ధర కలిగిన వస్తువుపై ప్రీమియం చెల్లించడంపై మీరు పెట్టుబడి పెట్టడం అంత లాభదాయకం కాదన్నారు.

ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మార్గనిర్దేశాల ప్రకారం.. బ్యాంకులు బంగారు నాణేలను కొనుగోలు చేయవు. మీరు ఇంతకుముందే బ్యాంకు నుంచి గోల్డ్ కొనుగోలు చేసినప్పటికీ వాటిని తిరిగి బ్యాంకుకే విక్రయించలేరు. ఈ సందర్భాల్లో మీరు బంగారం లేదా ఆభరణాలు దుకాణాలకు వెళ్లి మళ్లీ మార్కెట్ ధరకే విక్రయించుకోవాల్సి ఉంటుంది.

అంతేకాదు అత్యవసరంగా సొమ్ము అవసరమైతే మీరు పాన్ షాపు లేదా స్థానిక నగదు దుకాణానికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి బంగారు నాణేలను కొనుగోలే చేయాలనుకుంటే నమ్మదగిన వారి దగ్గర తీసుకోవాలి. అంతేకాకుండా తిరిగి విక్రయించేటప్పుడు బిల్లును మెయింటేన్ చేయాలి. భవిష్యత్తులో ధర పెరిగినా, ఇతర సమస్యలు రాకుండా డబ్బు కోసం ఆ జ్యూవలరీ షాపులోనే అమ్ముకునే వీలుందా అని ముందుగానే మీరు అడిగి తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news