శ్రీశైలం ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సంతాపం..!

-

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపాన్ని తెలియజేశారు. ‘శ్రీశైలం హైడ్రాలిక్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగి మనుషుల ప్రాణాలు పోవడం తీవ్రంగా బాధించింది.’ అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. అలాగే శ్రీశైలం హైడ్రాలిక్ ప్లాంట్‌లో ప్రమాదం తనను కలచివేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

కాగా, ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంటులో అగ్నిప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు, దారి తీసిన పరిస్థితుల్ని వెలికి తీయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news