అయోధ్య రామ మందిర నిర్మాణానికి అవసరమయ్యే విరాళాల సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ని విరాళం అందించాల్సిందిగా కోరారు. వారి వినతి మేరకు ఆయన తన వ్యక్తిగతంగా ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు. ఇక ఆయనదే మొదటి విరాళం. ఇటీవల కాలంలో రాష్ట్రపతి నుంచి విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి అని చెప్పచ్చు.
ఇక ప్రతినిధుల బృందం ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యను కూడా కలిసి విరాళాలను సేకరించనున్నారు. ఇక ఈ విరాళాల సేకరణ ఈరోజు ప్రారంభమై.. వచ్చే నెల 27వ తేదీ వరకు సాగనుంది. నిధుల సేకరణలో భాగంగా దేశవ్యాప్తంగా 13 కోట్ల కుటుంబాలకు చెందిన 65 కోట్ల మందిని రామభక్తులను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలో జరిగే ప్రచారంలో 40లక్షల మంది పాలు పంచుకోనున్నారు.