సొంతిల్లు కట్టుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారా..? మీ సొంతింటి కలని సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా..? ఇల్లు కట్టాలనే ప్లాన్ లో వున్నారా..? అయితే ఇది మీకు బ్యాడ్ న్యూస్. సొంతింటి కల సాకారం చేసుకోవడానికి రానున్న రోజుల్లో మీరు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇంటి ధరలు 10 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ధరలు పెరగడమే దీనికి కారణం. ఇది ఇలా ఉంటే కమోడిటీ ధరలు పెరిగి పోవడం వల్ల 2020 జనవరి నుంచి కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.
అదే విధంగా సిమెంట్, స్టీల్ మాత్రమే కాకుండా టైల్స్, బాత్‌రూమ్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఉడెన్ ఐటమ్స్ వంటివి కూడా బాగా పెరిగిపోయాయి. ఈ ధరలు గత ఏడాది కాలంలో ఏకంగా 20 – 30 శాతం పెరగడం జరిగింది. ధరల్ని 10 నుంచి 15 శాతం మేర పెంచాలని బిల్డర్లు అనుకున్నట్టు కూడా తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే లేబర్ కాస్ట్ కూడా పెరిగిందని డెవెలెపర్స్ అంటున్నారు. సిమెంట్, స్టీల్, కాపర్ సహా మిగిలినవి కూడా భారీగా పెరిగిపోవడం జరిగింది. 5 – 6 ఏళ్ల నుంచి హౌసింగ్ రేట్లు మాత్రం అలాగే ఉంటూ వస్తున్నాయని వివరిస్తున్నారు. అయితే కొత్త ప్రాజెక్టుల ధరలు మాత్రం పక్కాగా పెరిగే అవకాశం వుంది.