తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ, పార్టీ మారబోతున్నట్లు వచ్చిన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయమై చాలా మంది విమర్శించారు. మరికొంత మంది తెలంగాణ టిడీపీ ఖాళీ అయిపోయినట్టే అని వ్యాఖ్యానాలు చేసారు. టీఆర్ఎస్ లో చేరడంపై సానుకూలంగా స్పందించిన ఎల్ రమణ, ఈ రోజు పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు సమాచారం. కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
ప్రాథమిక పార్టీ సభ్యత్వం ఎల్ రమణకు ఇవ్వనున్నారు. అలాగే ఈ నెల 16వ తేదీన కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమిత్లో చేరుతున్నట్లు చెబుతున్నారు. ఎల్ రమణ పార్టీ మారుతుండడంతో తెలంగాణలో టీడీపీ పని అయిపోయినట్టే అని చెప్పుకుంటున్నారు. మరి తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ నెగ్గుకు రాగలదా లేదా అన్నది చూడాలి.