అనాధ పిల్లలకు రూ. 10 లక్షల సాయం పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

-

కరోనా సమయంలో ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. వారందరిని అన్ని విధాలా ఆదుకుంటామని గత ఏడాది ప్రకటించిన ప్రధాని మోదీ.. తాజాగా ఆ పథకాన్ని ప్రారంభించారు. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకం కింద అనాధ పిల్లలకు ఆర్థిక ప్రయోజనాలను అందజేస్తున్నారు. ఢిల్లీ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకాన్ని ప్రారంభించారు.18-23 ఏళ్ళ వయసు నుండి ఉన్నత విద్య చదివేవారికి ప్రతి నెల స్టై ఫండ్ ఇస్తారు. 23 ఏళ్ళు వచ్చాక రూ. 10 లక్షల లను అందిస్తాం, అంతేకాదు ఆయుష్మాన్ హెల్త్ కార్డులతో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం అందుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో.. తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో, తండ్రినో కోల్పోయిన పిల్లలు పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకానికి అర్హులు. ఈ పథకానికి అర్హులైన పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు” పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్” పేరుతో పోర్టల్ ని ఇప్పటికే ప్రారంభించారు. పేర్ల నమోదు తో పాటు దరఖాస్తు ఆమోద ప్రక్రియ సాయం అందించడం వరకు అన్ని ఈ పోర్టల్ నుంచే సాగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news