ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక నటుడు.. ఎవరో తెలుసా..?

-

సినిమా రంగానికి , రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే . గతంలో సినిమాల ద్వారా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న ఎంతో మంది తారలు ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇటీవల చాలామంది సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చి సక్సెస్ అయిన హీరోలలో కేవలం బాలకృష్ణ మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో రాజకీయాలలో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న తర్వాత సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు. గతంలో ఒక నటుడు ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి సినిమాలో నటించారట. ఇక ఆయన ఎవరో ఇప్పుడు పూర్తిగా చదివి తెలుసుకుందాం.File:Angry rajanala.jpg - Wikimedia Commonsఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటించి హీరోలతో సమానంగా పారితోషకం అందుకున్న నటుడు రాజనాల. ఈయన పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. సుమారుగా నాలుగు దశాబ్దాలకు పైగా 400లకు పైగా చిత్రాల్లో నటించి వివిధ రకాల పాత్రలను పోషించాడు. తెలుగు సినిమాలలోనూ.. నాటకాలలోను ఎక్కువగా నటించిన ఈయన కొన్ని తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. ఇక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో కంసుడు గా, జరాసంధుడి గా, మాయలపకీరు గా, దొంగల నాయకుడిగా, భూకామందుడిగా ఇలాంటి ఎన్నో ప్రతినాయక పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.elurumovies369® on Twitter: "#OldMemories NTR With Jayalalitha NBK With Jayalalitha #RIPJayalalitha #Ripamma #JoharJayalalitha https://t.co/Jq08OugRWj" / Twitterఒకసారి 1951లో రాజనాల మిత్రుడు లక్ష్మి కుమార్ రెడ్డి నుంచి మద్రాస్ కు పిలుపు వచ్చింది. అప్పటికే లక్ష్మి కుమార్ రెడ్డి నిర్మాత హెచ్.ఎం.రెడ్డి వద్ద పని చేస్తున్నారు.ఆయన తీసే ప్రతిజ్ఞ సినిమాకు నెలకు 200 రూపాయల తో కాంట్రాక్టులు కుదుర్చుకొని .. విలన్ గా రాజనాలను ఎంపిక చేశారు. 1953లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఎన్టీఆర్ నటించిన వద్దంటే డబ్బు సినిమా లో ముసలి జమీందారుగా ఎన్టీఆర్కు మామ పాత్రలో నటించే అవకాశాన్ని సొంతం చేసింది.MG Ramachandran Birth Anniversary: 5 Must-watch Films of the Actor

. ఇక అలా ఎన్నో చిత్రాల్లో నటించి ఎన్టీఆర్ కు బాగా సన్నిహితుడిగా మారిపోయాడు. ఇకపోతే తన సినీ కెరీర్లో ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మొదటి నటుడిగా రాజనాల గుర్తింపు తెచ్చుకున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు, ఎం.జి.రామచంద్రన్ , జే.జయలలిత వంటి ముగ్గురు ముఖ్యమంత్రులతో సినిమాలలో ఆయన నటుడిగా నటించడం గమనార్హం. ఇక బాలీవుడ్లో కూడా మంచి స్నేహితులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news