ట్విట్టర్ లో 100 మిలియన్ల ఫాలోవర్స్ ని సాధించిన ప్రధాని నరేంద్ర మోడీ

-

అత్యధిక ఆదరణ పొందిన నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉన్నారు. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ల మార్కును చేరుకుంది. ఇండియా నుంచి ఈ ఫీట్ నమోదు చేసిన తొలి రాజకీయ నేతగా ఆయన రికార్డు సృష్టించారు.

దీంతో ప్రధాని మోడీ తన ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ను తీసి ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తనను 100 మిలియన్ల మంది ఫాలో కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. “ఈ చురుకైన మాధ్యమంలో ఉండటం, చర్చలు, అంతర్దృష్టులు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు మరిన్నింటిని ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సమానంగా ఆకర్షణీయమైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను.” అని ప్రధాని తెలిపారు. ఓవరాల్గా అత్యధిక ఫాలోవర్ల జాబితాలో ఏడో స్థానానికి చేరారు. తొలి ఆరు స్థానాల్లో ఎలాన్ మస్క్ (188.7M), ఒబామా(131.7M), రోనాల్డో(112M), జస్టిన్ బీబర్ (110.5M), రిహన్నా (108M), కాటీ పెర్రీ(106.3M) ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news