టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా రంజీల్లో సంచలన ప్రదర్శన చేశాడు. అసోంతో జరుగుతున్న మ్యాచుల్లో ట్రిపుల్ సెంచరీ తో సత్తా చాటాడు. ముంబై తరపున ఆడుతున్న షా, 383 బంతుల్లో 379 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 49 ఫోర్లు, నాలుగు సిక్సులు బాదాడు. క్వాడ్రాపుల్ సెంచరీ కూడా చేసేలా కనిపించిన ముంబై క్రికెటర్, 17 రన్స్ దూరంలో అవుట్ అయ్యాడు.
ముంబై తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రెండో భారత క్రికెటర్ గా షా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడు మహారాష్ట్రకు చెందిన నింబాల్కర్. 1948-49 రంజి సీజన్లో అతడు సౌరాష్ట్ర పై 443 పరుగులతో అజయంగా నిలిచాడు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న సంజయ్ మంజ్రేకర్ ను పృథ్వీషా వెనక్కి నెట్టాడు.