ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళంలో దారుణం చోటు చేసుకుంది. ఆగిఉన్న లారీని ఒక ప్రయివేటు బస్సు ఢీ కొట్టింది. శ్రీ కాకుళం జిల్లాలోని రణ స్థలం మండలంలో గల పైడి భీమవరంలో ఈ ప్రమాదం జరిగింది. కాగ ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే మరో ముగ్గురి పరిస్థతి అత్యంత విషమంగా ఉంది. కాగ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
స్థానికుల సాయం తో పోలీసులు క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీశారు. ముగ్గురి పరిస్థతి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కాగ ఈ ప్రయివేటు బస్సు.. ఒడిశాకు చెందినట్టు పోలీసులు గుర్తించారు. ఈ బస్సు ఒడిశా నుంచి కేరళ రాష్ట్రానికి వెళ్తున్నట్టు పోలీసులు గుర్తుంచారు. కాగ ఈ ప్రయివేట్ బస్సులో ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు ఉన్నారని శ్రీకాకుళం జిల్లా పోలీసులు తెలిపారు.