ఉగాది పండుగ పర్వదినాన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా కొత్తూరు బైపాస్ హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.కడప జిల్లా బద్వేల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు.. ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి వోల్వో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్దారించినట్లు సమాచారం.