విలన్ గా నటించాలని ఉందంటున్న ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీ.

-

నటనలో కొంతే సాధించానని.. మరెంతో దూరం ప్రయాణించాల్సి ఉందని అంటోంది ఫ్యామిలీ మెన్ బ్యూటీ ప్రియమణి. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో జోరు పెంచింది ప్రియమణి. తాజాగా ఆహా ఓటీటీలో ‘భామా కలాపం’ విడుదలైంది. ఇందులో అనుపమ అనే పాత్రలో పక్కింటి గొడవల్లో తలదూర్చుతుంది.

గతంలో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది ప్రియమణి. ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ రెండు సీజన్లు విడుదలై… చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే తాజాగా తన కెరీర్ పై వ్యాఖ్యలు చేసింది ప్రియమణి. నటిగా నేనిప్పటి వరకు చేసిన సినీ ప్రయాణాలు కొంతే.. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మరిన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించాలని ఉందని.. ముఖ్యంగా విలన్ గా నటించాలని ఉందంటూ.. మనసులో మాటను వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version