బ్యూటీ స్పీక్స్ : ప్రియ‌మైన జెస్సీకి .. భామా క‌లాపం నుంచి…

-

ఇద్ద‌రు హీరోయిన్లు
ఒక‌రంటే ఒక‌రికి ప్రేమ
ప్రియ‌మ‌ణి త‌న ప్రేమ‌ను
స‌మంత‌పై చ‌ల్లారు
కురిపించారు.. ఆ వానను
ఆ ఊసుల‌తో పాటు ఇంకొన్ని ఈ క‌థ‌నంలో!

అందంతో పాటు తెగింపు ఉంద‌నుకోండి ఏమ‌నాలి డేర్ డెవిల్ అని అనాలి.అందంతో పాటు స‌క్సెస్ కూడా ఉంద‌ని అనుకోండి అప్పుడు స్టార్ డ‌మ్ మోగింద‌ని చెప్పాలి. అందంతో పాటు తెలివి కూడా అప్లై అయింది అనుకోండి అప్పుడు ఏమ‌నాలి షీ ఈజ్ ఇంటెలిజెంట్ అని చెప్పాలి.అందంతో పాటు అణ‌కువ కూడా జోడీ అయితే ప్రియ‌మ‌ణి అని చెప్పాలి.అందంతో పాటు స్నేహం కూడా తోడ‌యితే ప్రియ‌మ‌ణి అని చెప్పాలి. అందంతో పాటు తెగువ కూడా తోడ‌యితే స‌మంత అని చెప్పాలి.

ఇవాళ ఆ ఇద్ద‌రు అందాలూ తెర‌పై ఎక్క‌డో ఓ చోట క‌నువిందు చేస్తూనే ఉంటాయి. ఎక్క‌డో ఓ చోట ప్రియ‌మ‌ణి కానీ స‌మంత కానీ ప్ర‌స్తావ‌న‌లో ఉంటారు. కానీ ప్రియ‌మ‌ణి క‌న్నా స‌మంత కెరియ‌ర్ ప‌రంగా దూసుకుపోతుంది క‌నుక ఎక్కువ మాట‌లు స‌మంత‌వే అయి ఉంటాయి ఇండ‌స్ట్రీ లోప‌ల మ‌రియు బ‌య‌ట కూడా! ఆ ఊసుల్లో కొన్ని ప్రియ‌మ‌ణి మాట‌ల్లో కొన్ని ఈ క‌థ‌నంలో!

అందం నుంచి అభిన‌యం దాకా సమంతకు వ‌చ్చిన మార్కులు నూటికి నూరు.అందం నుంచి వ్య‌క్తిత్వం వ‌ర‌కూ సమంత‌కు వ‌చ్చిన మార్కులు నూటికి నూరు. స‌మంత అనే అమ్మాయికి అందంతో పాటు ఇంకొన్ని గుణాలున్నాయి.సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ప్ర‌యోగాలు చేయాల‌న్న త‌ప‌న ఉంది. ఒకే త‌ర‌హాలో ఉండ‌కూడ‌దు న‌టించ‌కూడ‌దు అన్న నియ‌మాలు ఉన్నాయి. వీటికి విష‌యంలో ఆమెకు వంద‌కు రెండు వంద‌ల మార్కులు.

ఇత‌రులు డిఫైన్ చేసే స్థాయిలో కెరియ‌ర్ ను డిజైన్ చేసుకునే స‌మ‌ర్థ‌త కూడా ఆమెకే ఉంది. అందుకే స‌మంత విభిన్నం అయిన సినిమాల‌కు, విభిన్నం అనుకునే పాత్ర‌ల‌కు త‌రుచూ ఎంపిక అవుతోంది. ఆ విధంగా ఆమె ఛాయిస్ బాగుంది. ఎంపిక బాగుంటే ఫ‌లితం కూడా ఇంకాస్త బెట‌ర్ వే లో ఉంటుంది క‌దా! ఆ విధంగా ఇవాళ ఆమె ఎంపిక మ‌రియు ఫ‌లితం రెండూ కూడా అర్థ‌వంతంగానే ఉన్నాయి.

ఇదే సంద‌ర్భంలో మ‌రో అందాల న‌టి ప్రియ‌మ‌ణి.. త‌న భామాక‌లాపం సినిమా విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా ఈ శుక్ర‌వారం ఆహా లో స్ట్రీమ్ అవుతున్న సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూ ఇస్తూ ఇస్తూ స‌మంత‌ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తింది. ఇప్పుడు సినిమా సూత్రాలే మారిపోతున్నాయి. అంతేకాదు నాయికా ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకు న‌య‌న‌తార, స‌మంత లాంటి ఆర్టిస్టులే ఉదాహ‌ర‌ణ.

మూస ప‌ద్ధ‌త‌ల‌కు ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేసిన న‌టి స‌మంత అని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది. అంతేకాదు పుష్ప సినిమా కోసం ఊ అంటా ఊహూ అంటావా అంటూ ఆమె ఆడిపాడిన వైనంపై కూడా ప్రియ‌మ‌ణి ఫిదా అయిపోయింది. అవును! ఆ విధంగా చూసుకుంటే స‌మంత ఇప్పుడు రోల్ మోడ‌ల్. న‌టీన‌టులంద‌రికీ!

పెళ్ల‌యింది నీకెందుకు సినిమాలు అని అన్నారు. ఫ్యామిలీ మేన్ అనే వెబ్ సిరీస్ లో న‌టించి, బోల్డ్ క్యారెక్టర్ అయినా ఏ మాత్రం వెనుకంజ వేయ‌కుండా న‌టించి, విమ‌ర్శ‌కుల ద‌గ్గ‌ర నుంచి మార్కులు కొట్టేసింది. సుకుమార్ లాంటి డైరెక్ట‌ర్ల‌కు త‌నంటే ఎందుకు ఇష్ట‌మో రంగ‌స్థ‌లం చూస్తే తెలుస్తుంది అని చెప్ప‌క‌నే చెప్పింది. అంతేకాదు ఓ బేబీ లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు తానెందుకు ఓటేస్తానో కూడా ఇదివ‌ర‌కే చెప్పింది. వైవిధ్యం అన్నది ప్ర‌ధానంగా ఉంటే సినిమాల‌కే త‌న ప్రాధాన్యం అని ప‌దే ప‌దే చెప్పేందుకే ఇన్ని ప్ర‌యోగాలు ఇన్ని విమ‌ర్శ‌లు రెంటింటినీ ఏక‌కాలంలో మోస్తున్నాననీ అంటోంది.

మ‌ళ్లీ ప్రియ‌మ‌ణి మాట‌ల ద‌గ్గ‌ర‌కే వ‌స్తే.. పుష్ప‌లో ఒక్క పాట‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారామె.హాట్ లుక్స్ తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టారు. నా భ‌ర్త కూడా ఈ పాట‌కు ఫిదా అయిపోయారు. నిజంగా ఇది ఒక డేర్ స్టెప్. అందుకు సామ్ కు కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారామె. ఒక్క ప్రియ‌మ‌ణి అనే కాదు ఇవాళ చాలా మంది న‌టీన‌టుల‌కు స‌మంత రోల్ మోడ‌ల్.

సొంత వ్య‌క్తిత్వం, సొంత నిర్ణ‌యాలు తీసుకునే నైజం, కొన్ని త‌ప్ప‌వు అనుకున్న‌ప్పుడు వాటి నుంచి త‌ప్పుకోవ‌డం, రిలేష‌న్ పై స్ప‌ష్ట‌మ‌యిన అభిప్రాయాలు ఉండ‌డం ఇవ‌న్నీ స‌మంత ఆధునిక‌త భావాల‌కు సంకేతాలు. వీటితో కొంద‌రికి విభేదం ఉన్నా ప‌ట్టించుకునే తీరిక‌లో సమంత లేదు. ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం కూడా స‌మంతకు లేదు గాక లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version