మీ ఒంట్లో ఫైబర్ తక్కువగా ఉందేమో అని సందేహమా…? అయితే ఇలా తెలుసుకోవచ్చు..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని పోషకపదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. పోషక పదార్థాలు అన్నీ అందాలంటే అన్ని రకాల పోషక పదార్థాలు మన ఆహార పదార్థాల ద్వారా తీసుకుంటూ ఉండాలి. విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ కూడా మన ఆహారంలో ఉండేటట్టు చూసుకుని డైట్ లో తీసుకోవాలి. శరీరంలో ఫైబర్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి.

ఫైబర్ అనేది ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది సులభంగా జీర్ణం అవ్వదు. అయితే ఫైబర్ కనుక శరీరంలో తక్కువగా ఉంటే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామందిలో ఫైబర్ లోపం కూడా ఉంటుంది. ఫైబర్ లోపం ఉందని ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫైబర్ లోపం ఉండేవాళ్ళల్లో ఈ లక్షణాలు ఉంటాయి.

ఊబకాయం:

ఫైబర్ లోపం ఉన్నవాళ్లలో ఊబకాయం సమస్య ఉంటుంది. ఫైబర్ ని తక్కువగా తీసుకోవడం వల్ల క్రమంగా బరువు పెరిగి పోతూ ఉంటారు. అటువంటి వాళ్లు ఫైబర్ ను అధికంగా ఆహార పదార్థాల ద్వారా తీసుకుంటూ ఉండాలి.

మలబద్దకం సమస్య:

ఈ సమస్య ఉన్నట్లయితే కూడా ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఫైబర్ లేకపోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఫైబర్ ని ఎక్కువగా ఆహార పదార్థాలలో తీసుకోవాలి.

షుగర్ లెవెల్స్:

షుగర్ లెవల్స్ లో కూడా మార్పులు వస్తుంటాయి. ఫైబర్ ని ఆహారంలో తీసుకోకపోవడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు బరువు బాగా పెరిగి పోతూ ఉంటారు.

జీర్ణ వ్యవస్థ సరిగా ఉండకపోవడం:

ఫైబర్ ఆహారం లో లేకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బాగోదు. ఫైబర్ ని తక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. వికారం, వాంతులు, అలసట, చెడు కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా
ఫైబర్ తక్కువగా ఉండడానికి కారణాలు.