కొన్ని రోజుల క్రితం షూటింగ్స్ బంద్ చేసి మరీ గిల్డ్ నిర్మాతలు మీటింగ్స్ పెట్టుకొని ఇండస్ట్రీలో సమస్యలను పరిష్కరించాలని పెద్ద నిర్మాతలు అందరూ కూర్చుని మీటింగ్ పెట్టుకున్నారు. ఇట్టి మీటింగ్ లో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిగాయి. కొన్ని కాస్ట్ కటింగ్ చేయవలసిన అవసరం ఉన్న పనులు పై నిర్ణయాలు తీసుకున్నారు.
అందులో ముఖ్యంగా హీరోయిన్లు పక్కన ఉండే వారి ఖర్చు వారే భరించాలి అని, అలాగే అవసరం ఐతేనే కార్ వాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు . అయితే తాజాగా నిర్మాత కళ్యాణ్ ఈ షూటింగ్ బంద్ ని ఒక అట్టర్ ఫ్లాఫ్ షో గా అభివర్ణించారు. దిని వల్ల సమయం, డబ్బు వృధా తప్పితే ఎలాంటి మేలు జరగలేదని చెప్పుకొచ్చారు.
చిన్న సినిమా నిర్మాతకు చాలా సమస్యలు వున్నాయి. వీటికి పరిష్కారం దొరుకుతుందని షూటింగ్ బంద్ కి అంగీకరించాను. కాని ఇది సాధ్యం అయ్యేలా లేదని నాకు తెలుసు. మొదటి నాలుగు మీటింగ్స్ లోనే దీంతో ఏం జరగదని అర్ధమైపోయింది. కొన్ని సమస్యలు, లోపాలు గుర్తించారు. కానీ వాటి అమలు జరగలేదు. ఎవరో కొంత మంది నిర్మాతలు వారి వ్యక్తిగత లాభాల కోసం చేసుకున్న బంద్ దీని వల్ల ఎవరకి లాభం లేకుండా పోయింది. మళ్లీ ఎక్కడి సమస్యల అక్కడే ఉన్నాయి అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.