PAWAN KALYAN : భీమ్లా నాయక్ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్నాడు. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 

అయితే.. తాజాగా నిన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ ఈ సినిమా మేకింగ్ వీడియో ను చిత్ర బృందం రీలిజ్ చేసింది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే..  షూటింగ్ సమయంలోనూ త్రివిక్రమ్ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నట్టు లేటెస్ట్ గా ఇవాళ సాయంత్రం విడుదల చేసిన మేకింగ్ వీడియోతో అర్థమౌతోంది. ఈ వీడియోలో అధ్యాంతం పవన్ కళ్యాణ్ కన్నులారా కనిపించారు. అలాగే రానా కూడా ఈ మేకింగ్ వీడియో మెరిశారు.

ఇక   సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రను పవన్ కళ్యాణ్, అతనితో ఢీ కొట్టే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను రానా చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తాజా మేకింగ్ వీడియోతో తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news