ఆ మంత్రులే కేసీఆర్‌కు నెగిటివ్ అవుతున్నారా?

-

తెలంగాణ క్యాబినెట్‌లో ఉన్న పలువురు మంత్రులని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ క్యాబినెట్‌లో ఉండే పలువురు మంత్రులు అవినీతి, అక్రమాలు చేయడంలో ముందున్నారని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు వస్తున్న మంత్రులు వల్ల కేసీఆర్‌కే కాస్త నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

cm-kcr
cm-kcr

సాధారణంగా అధికార పక్షంపై ప్రతిపక్షాల విమర్శలు సహజంగానే ఉంటాయి. కానీ వాటిని సీఎంలు పెద్దగా పట్టించుకోరు. తన క్యాబినెట్‌పై ఆరోపణలు వచ్చిన కూడా లైట్ తీసుకుంటారు. ప్రజలు కూడా ఈ విమర్శలు మామూలే అంటున్నారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్ పేదల భూముల కబ్జా చేశారని చెప్పి, ఆయనపై విచారణ వేసి, మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆ తర్వాత ఈటలకు బయటకు వెళ్ళడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక జరగడం అనివార్యమవ్వడం జరిగిపోయాయి.

ఆ విషయాలని పక్కనబెడితే, కేసీఆర్ క్యాబినెట్‌లో ఉన్న పలువురు మంత్రులపై కూడా ఆరోపణలు వచ్చాయి. మరి వాటిపై కేసీఆర్ విచారణకు ఆదేశించలేదు. ఇప్పుడు ఇదే అంశం ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు ప్లస్ అవుతుంది. అయితే క్యాబినెట్‌లో చాలామంది మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఓ మంత్రిపై అయితే పదే పదే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి సైతం ఆ మంత్రి టార్గెట్‌గా విమర్శలు కూడా చేశారు. మరి అలాంటి మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని న్యూట్రల్ వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా కొందరు మంత్రుల వల్ల కేసీఆర్‌కే నెగిటివ్ వచ్చేలా ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news