రామోజీ ఫిలిం సిటీ లో ప్రభాస్ “కల్కి” షూటింగ్ … !

-

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి” శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఈ మధ్యనే ఈ సినిమా నుండి విడుదల అయిన టైటిల్ గ్లిమ్ప్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రపంచ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి మరో అప్డేట్ కాసేపటి క్రితమే తెలిసింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోందట. సినిమా షూటింగ్ కేవలం కొంతభాగమే మిగిలి ఉందని మూవీ యూనిట్ తెలుపుతోంది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి 2024 మే 9 కల్లా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కానీ అన్నీ కూడా అనుకున్న విధంగా జరిగితేనే ఇది వీలవుతుంది. ఇక మరోవైపు ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news