ప్రతి జిల్లాలో బాల బాలికలకు సైనిక పాఠశాల ఏర్పాటు చేస్తాం : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

-

వరంగల్ వేదికగా బీఎస్పీ విద్యార్థి బహుజన యోజన డిక్లరేషన్ ప్రకటించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పూలే విద్యా భరోసా కార్యక్రమం చేయబోతున్నామన్నారు. భరోసా క్రింద గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు మెట్రో, బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లాలో బాల బాలికలకు సైనిక పాఠశాల ఏర్పాటు చేస్తామని, లలిత కళల పాఠశాల ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. 600లకు పైగా మండలాల్లో అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఏర్పాటు చేసి బస్ సౌకర్యం కల్పిస్తామన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. జాంబవ స్టూడెంట్ స్పార్క్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 24×7 వైఫై సౌకర్యం, 12 వేలపై గ్రామాల్లో ఎయిర్ కండిషనల్ కోచింగ్ సెంటర్ లు ఏర్పాటు.

Telangana: Renowned IPS Officer Praveen Kumar Targeted by Hindutva Groups

కోచింగ్ సెంటర్ లలో కంప్యూటర్, కోడింగ్ భాష నేర్పిస్తాం. కోడింగ్ ను నాల్గవ బాషా గా అమలు చేస్తాం. చదివించడమే కాదు,ఉద్యోగం పొందేలా ఉద్యోగ హక్కు తీసుకొస్తాం. విద్యార్థి యువజన సంఘాల్లో నాయకత్వ లక్షణాలు గల విద్యార్థి యువజన నాయకులను ప్రభుత్వ శాఖల్లో షాడో మంత్రులుగా నియమిస్తాం. గద్దర్ ఫ్రీడమ్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తాం… జానపద, లలిత కళలకు ప్రాధాన్యత ఇస్తు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేందుకు కృషి చేస్తాం. అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం కల్పిస్తాం. శ్రీకాంతచారి ఉద్యోగ హామీ పేరుతో జాబ్ కార్డు ప్రకటిస్తాం. పేపర్ లీకేజీకి పాల్పడేవారికి యావజ్జీవ కారాగార శిక్ష పడే చట్టం తీసుకొస్తాం. పేద విద్యార్థులకు ఏజ్ తో సంబంధం లేకుండా ఒక జత షూ, ట్రాక్ షూట్, వాచ్, స్పోర్ట్స్ కిట్స్ ప్రభుత్వపరంగా అందజేస్తాం. అమ్మాయిల అందరికీ ప్రభుత్వ పరంగా ఫోర్ వీలర్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ ఇప్పిస్తాం. విశ్వవిద్యాలయాలను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. బహుజన రాజ్యలో విశ్వవిద్యాలయాలను సువర్ణ యుగంలోకి తీసుకొస్తాం. ఇందులో ఏ ఒక్కటి అమలు చేయకపోయినా ప్రజలు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news