కేసీఆర్ మాట‌లను నిర‌సిస్తు.. కాంగ్రెస్ దీక్షలు : రేవంత్ రెడ్డి

-

అంబేత్క‌ర్, భార‌త్ రాజ్యాంగాన్ని అవ‌మానిస్తు.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంద‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తు.. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో దీక్షలు చేయ‌నున్నట్టు ప్ర‌క‌టించారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు గాంధీ భ‌వ‌న్ లో దీక్షలు చేస్తామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాల‌న్న మాట‌లను వ్య‌తిరేకిస్తు.. అన్ని జిల్లాల‌లో, నియోజ‌క కేంద్రాల్లో, మండ‌లాల్లో అంబేత్క‌ర్ విగ్రాహాల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మ‌ల‌ను దగ్ధం చేయాల‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపును ఇచ్చారు.

అలాగే బీజేపీ ఆలోచ‌న‌ల‌నే కేసీఆర్ ఇప్పుడు అన్నార‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ క‌ల్తీ మ‌ద్యం తాగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడ‌ర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌చ్చె నెల‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఉత్త‌ర ప్ర‌దేశ్ లో, కేంద్రంలో బీజేపీ ని నిల‌బెట్టాల‌నే ఉద్ధేశంతోనే కేసీఆర్ ఇలా మాట్లాడ‌ర‌ని ఆరోపించారు. ఒక ముఖ్య‌మంత్రి అయి ఉండి ఇలాంటి భాష మాట్లాడ‌టం స‌రికాద‌ని అన్నారు. కేసీఆర్ భాషను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంద‌ని అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news