ఏపీతో తగ్గుమఖం పడుతున్న కరోనా … కొత్తగా 5983 కేసులు నమోదు.

-

ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గతుండటంతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంటోంది. థర్డ్ వేవ్ మొదలైన తర్వాత జనవరిలో ఏపీలో కొత్త కేసులు ఎక్కువగా వచ్చాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా నమోదవుతూ వచ్చాయి. దీంతో ప్రభుత్వం నైట్ కర్ప్యూతో పాటు పలు ఆంక్షలు విధించడంతో కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతూ వస్తోంది.

ap-corona

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,040 కరోనా పరీక్షలు చేయగా.. కేవలం కొత్తగా 5983 కేసులు మాత్రమే నమోదయ్యాయి. సోమ, మంగళ వారాల్లో వచ్చిన కేసులతో పోలిస్తే బుధవారం కేసుల సంఖ్య తగ్గింది. మంగళవారం ఏపీలో 6213 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 11 మంది ప్రాణాలు వదిలారు. నిన్న 11,289 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,662 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news