నింగిలోకి దూసుకెళ్లిన ‘కలాంశాట్’..

-

నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి గురువారం అర్ధరాత్రి ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ44 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ 28 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగి గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ44 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ పీఎస్ఎల్వీ – సీ44 ద్వారా తమిళనాడుకు చెందిన  పాఠశాల విద్యార్థులు రూపొందించిన కమ్యూనికేషన్‌ కి సంబంధించిన 1.2 కిలోల బరువున్న కలాంశాట్‌ ఉపగ్రహం తోపాటు 740 కిలోల మైక్రో శాట్‌-ఆర్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

పీఎస్ఎల్వీ విభాగంలో ఇది 46వ వాహకనౌక కాగా దీనిని పీఎస్‌ఎల్‌వీ-డీఎల్‌గా పిలుస్తున్నారు. ఇందులో మొదటి సారిగా బరువును తగ్గించి పరిమాణాన్ని పెంచేందుకు అల్యూమినియం ట్యాంకును ఉపయోగించారు.  మైక్రోశాట్‌-ఆర్‌ దేశ రక్షణ రంగ అవసరాల కోసం(డీఆర్‌డీవో) పంపారు. దీనికి డీఆర్‌డీఏ వారు పెలోడ్లను సమకూర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news