పబ్ జి గేమ్ ద్వారా ఇండియాలోని ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ అనే వ్యక్తితో పరిచయం అయ్యి.. అది ప్రేమ పెళ్లి వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఈమె భారతీయ పౌరసత్వం కోసం డిమాండ్ చేస్తుండడంతో ఇందులో ఏదో తిరకాసు ఉందని అనుమానించిన ఇండియా ప్రభుత్వం వెంటనే ఈమె గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. ఈమె పూర్తి వివరాల ప్రకారం పాక్ కు చెందిన మహిళ కావడం వాస్తవం, మరియు ఈమె స్నేహితుడు పాకిస్తాన్ ఆర్మీల సైనికుడిగా సేవలను నిర్వర్తిస్తున్నాడు. ఇక సీమ చదివింది కేవలం 5వ తరగతి మాత్రమే..అయినప్పటికీ ఈమె పాకిస్తాన్ నుండి దుబాయ్ కి , అక్కడి నుండి నేపాల్ ద్వారా ఇండియాకు చేరుకుంది. ఈ విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈమె చూపించిన బర్త్ కార్డు ప్రకారం అది 2022 లో జారీ చేసి ఉంది. కానీ పాక్ రూల్స్ ప్రకారం పుట్టిన తర్వాత బ్రీత్ కార్డు ఇస్తారు.
ఇప్పుడు ఇన్ని సారూప్యతలు ఉన్న సీమ ను ఇండియా ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈమె పాకిస్తాన్ నుండి ఏదైనా ఆపరేషన్ మీద వచ్చిందా ? లేదా పాక్ ఆర్మీ ఐసిస్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.