ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా..అలంపూర్ నియోజకవర్గం ఇక్కడ ఎప్పుడు ఏ పార్టీ గెలుస్తునో ఎవరి ఊహకు దొరకదు. అక్కడి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో సర్వేలు కూడా పసిగట్టలేవు అన్నట్లు పరిస్తితి ఉంటుంది. మొదట నుంచి అలంపూర్ లో అదే పరిస్తితి ఉంది. మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచిన తర్వాత 1978లో జనతా పార్టీ సత్తా చాటింది 1983లో టిడిపికి పట్టం కట్టారు.
ఇక 1985, 1989 ఎన్నికల్లో బిజేపి గెలవగా, 1994లో టిడిపి గెలిచింది. 1999లో బిజేపి, 2004లో ఇండిపెండెంట్, 2009లో కాంగ్రెస్ నుంచి అబ్రహాం గెలిచారు. తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల్లో అబ్రహాం టిడిపి నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి సంపత్ కుమార్ పోటీ చేసి గెలిచారు. నెక్స్ట్ అబ్రహాం బిఆర్‌ఎస్ లోకి వెళ్లారు. 2018 ఎన్నికల్లో ఆయనే దాదాపు 44 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
ఇక ఎమ్మెల్యేగా అబ్రహాం బాగానే పనిచేసుకుంటున్నారు. కాకపోతే నియోజకవర్గంలో పలు సమస్యలు, కొన్ని చోట్ల సరైన అభివృద్ధి జరగకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. పైగా ఎమ్మెల్యేకు సొంత పోరు ఎక్కువైంది. అలంపూర్ సీటు కోసం మాజీ మందా జగన్నాథం తనయుడు ప్రయత్నిస్తున్నారు. అటు బండారు భాస్కర్ సైతం ఇదే సీటుపై కన్నేశారు.
ఇటు కాంగ్రెస్ లో సంపత్ కుమార్ గట్టిగానే కష్టపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం అలాగే ఉంది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ ఓటమిని కవర్ చేసుకుంటూ ఆధిక్యంలోకి రావడానికి కష్టపడుతున్నరు. అయితే బిఆర్‌ఎస్ సీటు దాదాపు ఎమ్మెల్యే అబ్రహాంకే మళ్ళీ దక్కే ఛాన్స్ ఉంది..లేదంటే ఆయన తనయుడు పోటీ చేయవచ్చు. కానీ సీటు ఆశిస్తున్న నేతలు అబ్రహాంకు వ్యతిరేకంగా పనిచేస్తే బిఆర్‌ఎస్ పార్టీకే నష్టం. అటు కాంగ్రెస్ కు లాభం. ప్రస్తుతానికైతే ఇక్కడ బిఆర్‌ఎస్ లీడ్ లోనే ఉంది.