విశాఖలో ప్రాణం తీసిన పబ్‌జీ గేమ్ ..!

-

సాధార‌ణంగా ఇప్పుడు అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఏ కొత్త గేమ్స్‌ వచ్చినా ఏముందని డౌన్లోడ్ చేసి ఆడేస్తున్నారు. అలా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన గేమ్ పబ్జీ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ గేమ్‌కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఒక్కోసారి చాలా మంది ప్రాణాలు కూడా పోగుట్టుకుంటున్నారు. ఇటీవ‌ల ఓ యువకుడు పబ్జీ ఆడొద్దని చెప్పినందుకు తన తండ్రినే అతి దారుణంగా హతమార్చాడు. చివ‌ర‌కు ఆ తండ్రి శవం ప‌క్క‌నే రాత్రంతా గేమ్ ఆడాడు. ఇలాంటి ఘ‌న‌ట‌లు ఎన్నో జ‌రుగుతున్నాయి.

ఈ గేమ్ ఆడటం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ యువ‌కుడు రోజుల త‌ర‌బ‌డి గేమ్ ఆడుతూ చివ‌ర‌కు కుప్ప‌కూలిపోయాడు. ప్రస్తుతం యూత్ అంతా ఈ గేమ్ పిచ్చిలో పడి  గంటల తరబడి మొబైళ్లతో కాలం గడుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ప‌బ్‌జీ ఓ బాలుడి ప్రాణాన్ని బలిగొంది. చినకోరాడ ప్రాంతంలో నివాసముంటున్న బోయి వెంకటరమణ, త్రివేణి దంపతులకు కుమారుడు బోయి లోహిత్‌ (14)  ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. పబ్‌జీ గేమ్‌కు ఎడిక్ట్  అయిన లోహిత్‌ చదువు నిర్లక్ష్యం చేశాడు.

PubG Addiction To End A Life In Visakhapatnam

లోహిత్‌పై కోపంతో తల్లి త్రివేణి గత నెల 20న మందలించి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుంది. త‌ల్లి ఫోన్ లాక్కోవ‌డంతో మనస్తాపానికి గురైన లోహిత్‌ చీమలమందు నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ‌మ‌నించిన త‌ల్లిదండ్ర‌లు వెంట‌నే హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. 14 రోజుల చిక‌త్స అనంత‌రం కేజీహెచ్‌లో సోమ‌వారం చికిత్స పొందుతూ లోహిత్ మృతిచెందాడు.  ప‌బ్‌జీ ఆన్‌లైన్ గేమ్ వ్య‌స‌నం ఎంద‌రో ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటుంది. యువ‌త జీవితాల మీద దెబ్బ కొడుతోంది. ఇప్పుడు తాజాగా మన రాష్ట్రంలో కూడా ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version