ఎట్టకేలకి పెళ్ళికి రెడీ అయిన పున్నూ .. ఆబ్బాయి ఎవరంటే ?

బిగ్ బాస్ సీజన్ 3 ముందు వరకు పునర్ణవి భూపాలం అంటే పెద్దగా జనాన్ని తెలిసింది లేదు. హీరోయిన్ గా ఆమె కొన్ని సినిమాలు చేసినా అవి ఆమెకు పెద్దగా పేరు తీసుకు రాలేదు. ఆమెకు పేరు తెచ్చిన సినిమా అంటే ఉయ్యాల జంపాల సినిమా అనే చెప్పాలి. రాజ్ తరుణ్ – అవికా గోర్ హీరో హీరోయిన్ గా వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాలో పునర్నవి సునీత అనే ఒక క్యారెక్టర్ చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత చిన్నా చితకా సినిమాలు చేసినా పెద్ద గుర్తింపు తీసుకు రాలేకపోయాయి. అయితే బిగ్ బాస్ సీజన్ త్రీ లో ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఈమె నడిపిన లవ్ ట్రాక్ మాత్రం సూపర్ హిట్ అయింది.

నిజంగా లవ్ ట్రాక్ ఉందో లేక బిగ్ బాస్ స్క్రిప్టు ప్రకరం ట్రాక్ నడిపారో తెలియదుగానీ వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్కౌట్ అయింది, బయటికి వచ్చాక కూడా వీళ్ళిద్దరికి పెళ్ళి అన్నట్టు చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ వార్తలను వీరిద్దరు పలు సందర్భాల్లో ఖండిస్తూ వచ్చారు. అయితే తాజాగా నా ఎంగేజ్మెంట్ అయిపోయింది అని అర్థం వచ్చేలా పునర్నవి భూపాలం తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఆమె చేతిని మరో వ్యక్తి పాణిగ్రహణం చేసినట్టు ఉండగా దానికి ఈమె ఒక కామెంట్ కూడా పెట్టింది ‘ఫైనల్లీ ఇత్స్ హ్యాపెనింగ్’ అంటే ఎట్టకేలకి జరిగిపోతోంది అని అర్థం వచ్చేలా ఆమె కామెంట్ చేసింది. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు ఆ చేయి రాహుల్ దా లేక వేరే ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు చేయి చూపించింది కాబట్టి బహుశా త్వరలోనే ఆ వ్యక్తి ఫేస్ కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి దాకా వేచి చూడక తప్పదు మరి.