మహారాష్ట్రలోని పూణె నగరంలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు పూణెలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను విధించబోతున్నట్టు ప్రకటించింది. మహారాష్డ్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పాల దుకాణాలు, ఫార్మసీలు, ఆసుపత్రులు, ఇతర అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.
కరోనా లింక్ ను తెంచే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కాగా, పూణెలో గురువారం ఒక్కరోజే 1803 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 34,399 కేసులు నమోదయ్యాయి. అలాగే గురువారం ఒక్కరోజే పుణెలో 34 మంది కరోనాతో చనిపోయారు. దీంతో పూణెలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 978కి పెరిగింది