కాంగ్రెస్ పార్టీ దారుణంగా చతికిల పడింది. 5 రాష్ట్రాల్లో ఏ పార్టీలో ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. పంజాబ్ లో అధికారంలో ఉండి కూడా… గౌరవప్రదమైన సీట్లను సాధించలేకపోయింది. ఆప్ ధాటికి పంజాబ్ లోని హేమాహేమీలు ఓడిపోయారు. పటియాల నుంచి మాజీ సీఎం అమరిందర్ సింగ్, అమృత్ సర్ నుంచి పంజాబ్ పీసీసీ ఛీప్ నవజ్యోత్ సింగ్ సిద్దూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీ రెండు చోట్ల పోటీచేస్తే… చమ్కౌర్ సాహిబ్ మరియు బహదూర్ స్థానాల్లో ఓడిపోయారు. అకాళీదల్ సీనియర్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ నుంచి ఓడిపోయారు. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ కేివలవ 20 స్థానాలకే పరిమితం అయింది. ఆప్ ఏకంగా 89 స్థానాలు సాధించింది. ఆప్ ధాటికి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఓడిపోయారు. ఎన్నికల ముందు చాలా కాంగ్రెస్ అధిష్టానం చాలా ఎక్కువగా ఊహించుకున్న సిద్దూ పార్టీని నట్టేట ముంచారనే వాదనలు కూడా వస్తున్నాయి. అమరిందర్ సింగ్ ను బలవంతంగా బయటకు పంపించడం, కొత్తగా చన్నీని సీఎం చేయడం, సీఎం చన్నీకి, పీసీపీ చీఫ్ సిద్దూకు పడకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు చెలరేగాయి. చివరకు ఇవన్నీ ఆప్ పార్టీకి సాయపడ్డాయి.