పంజాబ్ రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకీ షాక్ తగిలేలా రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. మాజీ సీఎం కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్, బీజేపీ నేత కేంద్ర హోం శాఖా మంత్రి, అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ కాబోతున్నారు. ఈ పరిణామాలను చూస్తే కాంగ్రెస్ మరో కీలక నేతను కోల్పోబోతోందా..? అనే సందేహం కలుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి చరణజీత్ సింగ్ చన్నీని సీఎంగా నియమించింది. గత కోంత కాలంగా కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ, అమరీందర్ సింగ్ మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. సీఎంగా తొలగించిన సందర్భంలో అమరీందర్ సింగ్, సిద్ధూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్ధూకు పాక్ సీఎం ఇమ్రాన్ ఖాన్కు, ఆర్మీ ఛీఫ్ బజ్వాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇలాంటి వాడు సీఎం పదవికి అనర్హుడని విమర్శించాడు. ఇదిలా ఉంటే చివరికి సిద్ధూ చెప్పినవారికే సీఎం పదవి ఇవ్వడంతో అమరీందర్ రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరీందర్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో తాజగా అమిత్ షాతో జరగబోయే భేటీ బీజేపీలో చేరేందుకే అని చర్చ జరుగుతోంది. పంజాబ్ లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో అమరీందర్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. అలాంటిది కాంగ్రెస్ తనను అవమానకర రీతిలో సీఎం పదవి నుంచి తొలగించడం ఆయన అవమానంగా భావిస్తున్నాడు. పంజాబ్లో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీలోకి అమరీందర్ చేరితే ఆపార్టీకి మరింత బలం చేకూరనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.