తెలంగాణ నీటి పారుదల మోడల్ ను పంజాబ్ లోనూ అమలు చేస్తానని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు. సిద్దిపేట మర్కుక్ పంపు హౌస్ ను సీఎం కేసీఆర్ తో పాటు పరిశీలించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఈ సందర్భంగా భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ, తెలంగాణతో పాటు..పంజాబ్ లో అన్ని రకాల వనరులు ఉన్నాయన్నారు. అక్కడ సాంకేతికతను బాగా సద్వినియోగం చేసుకుంటున్నామని వెల్లడించారు.
తెలంగాణ నీటి పారుదలలో మోడల్ గా ఉంది…దీనిని పంజాబ్ లో కూడా అమలు చేస్తామని.. దేశ వ్యాప్తంగా రైతులు తీవ్ర సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించారు.జంతర్ మంతర్ దగ్గర రైతులు ఆందోళన చేశారని.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు లేదని కేంద్రం పై ఫైర్ అయ్యారు. కానీ 80 శాతం మంది వ్యవసాయమే చేస్తున్నారని.. పంజాబ్ లో బావులు, బోర్లతోనే పంటలు ఎక్కువగా పండుతాయన్నారు. తెలంగాణలో కాలువల ద్వారా పంటలు పడినట్టు..పంజాబ్ లోను అమలు చేస్తామని ప్రకటించారు భగవంత్ సింగ్ మాన్.