BREAKING : ఈ నెల 23న టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ !

-

ఏపీ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కన్నా లక్ష్మీనారాయణ. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా బిజెపి పార్టీని వీడారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారనే దానిపై అందరిలోనూ సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలోనే, టీడీపీ చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ సిద్ధం అయ్యారట. ఈ నెల 23న లేదా 24వ తేదీన టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ పార్టీ నేతలతో 10 రోజుల కిందటే సమావేశం అయ్యారట. ఇక ఈ నెల 23న లేదా 24వ తేదీన టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news