పంజాబ్ లో మళ్లీ కలకలం… గురుద్వారాలోకి ప్రవేశించేందుకు ఆగంతకుడి యత్నం.

పంజాబ్ లో మళ్లీ కలకలం చోటు చేసుకుంది. మరోసారి గురుద్వారాను అపవిత్రం చేసుందుకు అగంతకుడు ప్రయత్నించాడు. నిన్న ఓ ఆగంతకుడు అమృత్ సర్ నగరంలోని స్వర్ణ దేవాయలంలోకి ప్రవేశించి గురుగ్రంథ సాహిబ్ ను అపవిత్రం చేయాలని భావించిన ఓ అగంతకుడిని పట్టుకుని చితకబాదారు. ఈఘటనలో ఆఘంతకుడు మరణించిన సంగతి తెలిసిందే. సదరు వ్యక్తిని యూపీకి చెందిన వారిగా గుర్తించారు. తాజాగా మరోసారి ఇలాంటి దుశ్చర్చకే పాల్పడ్డాడు మరొక వ్యక్తి . పంజాబ్ లో కపుర్తలాలో గురుద్వారాలోకి చొరబడి అపవిత్రం చేయాలని ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్న సిక్కులు పట్టుకుని కొట్టి చంపారు.

అయితే వరసగా జరుగుతున్న సంఘటనపై అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరో మత ఘర్షణలను రెచ్చగొట్టేందుకే ఇలా చేస్తున్నారని శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఆప్ పార్టీలు కూడా నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ చర్యలపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆర్ఎస్ఎస్ కూడా నిన్న జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేసింది. దీంతో ఈ ఘటనలపై పంజాబ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మత ఘర్షణలు ఏర్పడాలని చూసేవారిని కఠినంగా శిక్షిస్తామని పంజాబ్ డీజీపీ హెచ్చరించారు.