తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, సినీ నటి విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. KCR అంటే.. కోతి, చేష్టల, రావు అంటూ విజయ శాంతి.. సీఎం పేరుకు కొత్త అర్థమే చెప్పారు. తెలంగాణాను రాజ్యం తీరుగా.. గత్తర బిత్తరగా పాలిస్తున్నారని సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు రాములమ్మ.
బీజేపీ కార్యకర్తలను తిరగనీయకండంటూ.. తిక్క బెదిరింపులకు పాల్పడుతున్నారని విజయ శాంతి ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. ప్రజా గ్రహంతోనే.. కుంటి సాకులు చూపి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ తరహాలోనే సీఎం కేసీఆర్ కు బుద్ది చెప్పేందుకు.. ప్రజలు ఎదురు చూస్తున్నారని రాములమ్మ పేర్కొన్నారు.
అటు ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ రాష్ట్రమని సీఎం కేసీఆర్ కు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీని అణచి వేసేందుకు మమతా బెనర్జీ అమలు చేసిన ఫార్ములా ఇక్కడ అమలు చేయాలను కుంటునారని… కానీ ఇది బెంగాల్ కాదు తెలంగాణ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పాలన చాతకాకపోతే చేతులెత్తేయాలని సవాల్ విసిరారు.