రాణించిన జడేజా.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచి పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్  బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 167 పరుగులు చేసింది. ఓపెనర్ రహానే 09 పరుగులు మాత్రమే చేసి విఫలం చెందాడు. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

మిచెల్ 30 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. శివం దూబే డకౌట్ గా వెనుదిరిగాడు. మొయిన్ అలీ 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఆ తరువాత వచ్చిన రవీంద్ర జడేజా ఎం.ఎస్. ధోనీ కూడా డకౌట్ కావడం గమనార్హం. రవీంద్ర జడేజా 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్ శార్దూల్ ఠాకూర్ 17 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ తుషర్ దేశ్ పాండే డకౌట్ అయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది చెన్నై జట్టు. 168 పరుగుల లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news