పోస్టల్ బ్యాలెట్ పై జగన్ ప్రభావం… వైసీపీకి జైకొట్టిన ఉద్యోగులు

-

ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఏకపక్షంగా జరిగేలా కనిపిస్తున్నాయి.వైసీపీ గెలుపు పోలింగ్ కంటే ముందుగానే తేలిపోయింది.ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి జైకొట్టారు.ఏపీ వ్యాప్తంగా నేడు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో మెజారిటీ ఉద్యోగులు వైసీపీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. నిన్న నిర్వహించిన హోమ్ వోటింగ్లో కూడా వైసీపీకె ఓటర్లు పట్టం కట్టినట్లు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా అధికశాతం ఓట్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ వైపు పోలవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో చంద్రబాబు ఉద్యోగులను చిన్నచూపు చూడటం..వాళ్లకు జీతాలేందుకు అని అవహేళన చేయడం ఇవన్నీ ఉద్యోగులకు గుర్తున్నాయి.దీంతోపాటు సీఏమ్ వైయస్ జగన్ అమలు చేస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్( జీపీఎస్) తమకు లాభసాటి అని ఉద్యోగులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులకు వ్యతిరేకమే అన్నది అందరికీ తెలిసిందే.

చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు మరింత నష్టం అని ఉద్యోగులు భయపడుతున్నారు.దీంతో పాటు చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే డబ్బు సరిపోదు.రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఇచ్చినా ఒక మూలకు రాదు.అలాంటపుడు చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆ పథకాలకు మళ్లించి తమకు అసలు జీతాలు కూడా రావని భయపడిన ఉద్యోగులు జగన్ మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధమయ్యారు.ఇది పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టంగా తేలిపోయింది.ఇప్పటికే భారీగా ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పోలైనట్లు తెలుస్తోంది.దీనినిబట్టి చూస్తే వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే అని అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news