రాజీనామాపై తగ్గేది లేదు.. రాజీపడే ప్రసక్తే లేదు- సిద్దూ

-

పంజాబ్ లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. నిన్ననవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామాతో మొదలైన రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. రాజీనామాకు మద్దతుగా ఒక మంత్రి రాజీనామా చేశారు. మరికొంత మంది రాజీనామాకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య ట్విట్టర్లో వార్ జరిగింది. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. నిన్న కొత్త సీఎం చన్నీ అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి సిద్ధూను బుజ్జగించేపనిని పలువురు మంత్రులకు అప్పగించారు. అయితే సిద్ధూ మాత్రం పీసీసీ ఛీఫ్ కు చేసిన రాజీనామాపై వెనక్కి తగ్గది లేదని తేల్చిచెబుతున్నారు. పంజాబ్ ప్రజల కోసం రాజీపడే ప్రసక్తి లేదని పునరుద్ఘాటిస్తున్నారు. తాజాగా రాజీనామాపై వెనక్కి తగ్గాలని పలువురు మంత్రులు కోరినా సిద్ధూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం చేయనని అలాాగే పంజాబ్ ప్రజలకు ఎలాంటి నష్టం రాబోనివ్వనని తేల్చిచెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news