5 రాష్ట్రాల ఎన్నికలు: పంజాబ్ అసెంబ్లీకి నేడు ఎన్నికలు, యూపీలో మూడో విడత పోలింగ్

-

5 రాష్ట్రాల ఎన్నికల్లో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. అన్ని పార్టీలు అత్యంత కీలకంగా భావిస్తున్న పంజాబ్ రాష్ట్రంలో నేడు ఎన్నికలు జరుగనున్నాయి. పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా… 2.14 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 1304 మంది అభ్యర్థులు తమ లక్ ను పరీక్షించుకోనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఈరోజు మూడో విడత పోలింగ్ జరుగనుంది. 59 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 627మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.15 కోట్ల మంది ఓటర్లు ఎన్నిలకల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  పంజాబ్ రాష్ట్రంలో బహుముఖ పోటీ నెలకొంది. ఈ రాష్ట్రంలో తిరిగి అధికారి నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కష్టపడుతోంది. 

కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్, బీజేపీ, శిరోమణి అకాళీదల్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్యే పోరు ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే… ఆప్ పంజాబ్ లో పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అమరిందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ తన ముద్రను పంజాబ్ పై వేయాలనుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news