బ్రేకింగ్ : పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద అగ్నిప్రమాదం

-

హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. ఫ్లై ఓవర్ ఫ్లోర్ కింది భాగంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. పిల్లర్స్ కి ఏర్పాటు చేసిన డెకరేషన్ సామాగ్రి లో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీగా పొగలు మంటలు రావడంతో పక్కనే ఉన్న వాహనదారులు ఉక్కిరి బిక్కిరయ్యారు.

దీంతో వెంటనే ట్రాఫిక్ నిలిపివేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రజలు ఎవరిని అటువైపు వెళ్ళకుండా ఆపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్ ప్రస్తుతం మంటలారిపే పనిలో ఉంది. నిజానికి యాడ్స్ ఇచ్చేందుకు గాను ఫ్లై ఓవర్స్ కింద అలా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అయితే అసలు మంటలు ఎందుకు చెలరేగాయి అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news