అమరావతి రాజధానికి కట్టుబడే వనరులు కేటాయించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి రూ. 2500 కోట్లు బీజేపీ ఇచ్చిందని ఆమె తెలిపారు. రూ.20 వేల కోట్లతో అమరావతి చుట్టూ అవుటర్ రింగు రోడ్డుకు కేంద్రం ఆమోదించిందని చెప్పారు. అమరావతి రాజధాని అనే విశ్వంతోనే కేంద్రం సహకరించిందని పేర్కొన్నారు. అమరావతి రాజధానికి తామూ కూడా కట్టుబడి ఉన్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
ఏపీ చేసిన అప్పులు పదిలక్షల కోట్లు పైచిలుకే.. ఏపీ అప్పులపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నా.. టీడీపీ రాసిన స్క్రిప్టుని చదవడం అనేది ఆరోపణలే.. గతంలో టీడీపీ విధానాలను తప్పుబట్టాను.. వైసీపీ విమర్శలను పట్టించుకోనవసరం లేదు.. ఎన్నికల్లో పొత్తులు 2,3 నెలల ముందు నిర్ణయిస్తాం.. టీడీపీతో పొత్తుని అధినాయకత్వం చూసుకుంటుంది.. టీడీపీలో ఏనాడూ సభ్యురాలిగా లేను.. రాష్ట్ర విభజన కారణంగానే కాంగ్రెస్ అన్నారు బీజేపీ లీడర్ పురంధేశ్వరి.