జనగణమన సినిమాతో హద్దులు చెరిపేయనున్న పూరీ జగన్నాథ్..!!

-

డాన్సింగ్ అండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో తెరకెక్కించిన చిత్రం లైగర్. ఈ సినిమా మిక్స్డ్ టాకును సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇప్పుడు మరొకసారి పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో రెండవ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఆ సినిమానే జనగణమన. ఇక పూరి జగన్నాథ్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా విజయ్ తో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా ప్రకటించారో లేదో సెట్స్ మీదకు తీసుకెళ్లి ఫాస్ట్ గా పూర్తి చేయాలని.. పూరి జగన్నాథ్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాను సెట్స్ మీదకు కూడా వెళ్లినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ సినిమా కంటే ముందే వీరిద్దరి కాంబినేషన్లో లైగర్ తెరకెక్కింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో గత కొన్ని రోజులుగా బిజీ ఉన్న వీరు జనగణమన సినిమాను కాస్త పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే జనగణమన టీం తో జాయిన్ అయినట్టు ఫోటోలు కూడా బయటకు రావడం జరిగింది. అంతేకాదు ఇప్పటికే ఒక షెడ్యూల్ సైతం పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరొక వార్త కూడా బయటకు రావడం జరిగింది.Vijay Devarakonda Announces JGM With Puri Jagannadh & Here's Why It's Not Called 'Jana Gana Mana' Using Just The Initialsఆర్మ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో భారీ విజువల్స్ ఉండబోతున్నాయట. అందుకే ఈ సినిమాకు లైగర్ ఫలితంతో సంబంధం లేకుండా ఖర్చు చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు దాదాపు రూ.100 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం పెడుతున్నట్టు ఇప్పుడు వార్తలు మరింత హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఈ సినిమాను పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ తో పాటు వంశీ పైడిపల్లి కూడా నిర్మాతగా మారబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ విదేశాలలో కూడా ఉండనుంది. వచ్చే ఏడాది ఆగస్టు మూడో తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ పై పూరి జగన్నాథ్ పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news